కోట్ల ఆస్తి ఉన్నా పైసా వాడుకోలేని పరిస్థితి తనది. తండ్రి పెట్టిన షరతు తనకు రూపాయి దక్కకుండా చేస్తోంది. అస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన క్లేర్ బ్రౌన్ రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు. ఆమెకు ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కానీ తన తండ్రి కూతురుకి తన ఆస్తి దక్కాలంటే తనకు శాశ్వత ఉద్యోగం ఉండి నలుగురికి సాయం చేసే స్థాయిలో ఉండాలంటూ చనిపోయే ముందు షరతు పెట్టాడు. ప్రస్తుతం ఆస్తి మొత్తం తండ్రి స్థాపించిన ట్రస్టు అధీనంలో ఉంది. దీంతో ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సదరు మహిళ…. కోట్ల ఆస్తి ఉన్నా కనీసం వైద్యం చేయించుకోలేని దుస్థికి చేరుకుంది. స్థానికంగా ఈమెను బ్రేక్ మిలియనీర్ అని పిలుస్తుంటారు.