టాలివుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ తండ్రయ్యాడు. సంక్రాంతి పండగ వేళ రాహుల్ భార్య హరిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ‘మగబిడ్డ..సంక్రాంతి రిలీజ్’ అంటూ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గతంలో గర్ల్ఫ్రెండ్కు లిప్ కిస్ చేస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేశాడు. కానీ ఆ తర్వాత పెళ్లి తేదీ కానీ, పెళ్లికి సంబంధించిన ముచ్చట్లను చెప్పలేదు. నవంబర్లో మళ్లీ తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పాడు.