‘తండ్రి చంపాడు, తల్లి మూటగట్టింది’ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘తండ్రి చంపాడు, తల్లి మూటగట్టింది’ – YouSay Telugu

    ‘తండ్రి చంపాడు, తల్లి మూటగట్టింది’

    November 21, 2022
    in India, News

    © File Photo

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలో గతవారం సూట్‌కేస్‌లో యువతి మృతదేహం దొరికిన కేసును పోలీసులు ఛేదించారు. 22 ఏళ్ల ఆయుషి చౌదరిని కన్న తండ్రే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయుషి తన తండ్రికి చెప్పకుండా కొన్ని రోజుల పాటు బయటకు వెళ్లింది. అలాగే ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా వేరే కులానికి చెందిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆయుషి తండ్రి నితేశ్‌ యాదవ్‌ ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్‌కేసులో ప్యాక్‌ చేయడంలో ఆమె తల్లి సహకరించింది. సూట్‌ కేసును తీసుకెళ్లి యమునా ఎక్స్‌ప్రెస్‌ వే సమీపంలో పారవేశారు.

    Exit mobile version