కేరళలో రెండు మంకీఫాక్స్ కేసులు నమోదవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని మంకీఫాక్స్ నోడల్ కేంద్రంగా ప్రకటించింది. ఇందులో 36 బెడ్లతో ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేసి.. పీపీఈ కిట్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, మంకీఫాక్స్ నోడల్ అధికారి డాక్టర్ శంకర్ తెలిపారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చే వారిని తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.
మంకీఫాక్స్ నోడల్ కేంద్రంగా ఫీవర్ ఆసుపత్రి

© Envato