ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు రష్యా మీద ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేశాయి. అయినా కానీ రష్యా మాత్రం యుద్ధాన్ని ఆపడం లేదు. తాజాగా ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫా కూడా రష్యాకు పెద్ద షాకిచ్చింది. రష్యాలో ఇకపై ఎటువంటి అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించబోమని, మ్యాచుల సందర్భంగా రష్యా పతాకాన్ని ఎగరవేయడం కానీ రష్యా జాతీయ గీతాన్ని ఆలపించడం కానీ చేయమని ప్రకటించింది. అనేక దేశాలు రష్యాతో ఫుట్‌బాల్ ఆడేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది.