• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.35 కోసం 5 ఏళ్లకుపైగా పోరాటం..దిగివచ్చిన రైల్వే శాఖ

    అప్పడప్పుడు బస్సుల్లో ప్రయాణించినపుడు మనకు రావ్వాల్సిన ఛేంజ్ రూ.1 లేదా రూ.2 ఇలా డబ్బులు మర్చిపోతుంటాం. కాని ఓ వ్యక్తి రైల్వే నుంచి తనకు రావాల్సిన రూ.2 కోసం 5 ఏళ్లకుపైగా పోరాటం చేసి దక్కించుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే రాజస్థాన్ కు చెందిన సుజీత్ స్వామి జూలైలో కోటా టూ ఢిల్లీ వెళ్లేందుకు 2017 ఏప్రిల్లో టికెట్ బుక్ చేశాడు. తర్వాత క్యాన్సల్ చేసుకోగా, జీఎస్టీ ఛార్జీల్లో భాగంగా రూ.35 రైల్వే శాఖ కట్ చేసింది. ఏప్రిల్లో టికెట్ బుక్ చేసుకుంటే ఎలా GST ఛార్జీలు వసూలు చేస్తారని తాను రైల్వే శాఖను ప్రశ్నించాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని 40కిపైగా దరఖాస్తులు చేశాడు. దీంతో దిగి వచ్చిన రైల్వే శాఖ రూ.33 తిరిగి ఇచ్చింది. కాని తనకు రావాల్సింది రూ.35 అని మరో రూ.2 కోసం మళ్లీ ప్రశ్నించగా రీఫండ్ చేసింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ 2017 జూన్ 2 కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.90 లక్షల మందికి రూ.35 సర్వీస్ ఛార్జ్ రీఫండ్ చేసింది.