వెండితరపై త్వరలో కార్తికేయ-2, 118 వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ తో అలరించనున్న హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల వల్ల తాను ఏడ్చానని చెప్పాడు. కార్తికేయ-2 రిలీజ్ కోసం తాను చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ‘తొలుత కార్తికేయ-2 జులైలో విడుదల చేద్దామనుకున్నాం, కానీ ఆగస్టు 12కు మార్చుకోవాలన్నారు. ఇప్పడు మళ్లీ అక్టోబర్ కు మార్చుకోవాలని చెబుతున్నారు. ఈ నిస్సహాయ స్థితిలో నాకు కన్నీరు ఆగలేదు’ అని నిఖిల్ చెప్పారు.