ఆత్మహత్యను చిత్రీకరించి.. ఆపై..!

© Envato

ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని నిలువరించకుండా.. వీడియో తీస్తూ మానవత్వాన్ని మంటగలిపారు కొందరు వ్యక్తులు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని హోస్పెట్‌లో జరిగింది. మూర్ఛ వ్యాధితో తాళలేక మంజునాథ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. రహదారిపైనున్న స్తంభమెక్కి పంచెతో ఉరేసుకుని తనువు చాలించుకున్నాడు. ఈ దృశ్యాల్ని చిత్రీకరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిజంగా దారుణం కదా.

Exit mobile version