ఒకేసారి రామ్‌ చరణ్‌, కమల్‌ హాసన్‌ సినిమాల చిత్రీకరణ

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తన తర్వాతి సినిమాల షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శంకర్‌ రామ్‌ చరణ్‌తో RC15, కమల్‌హాసన్‌తో భారతీయుడు2 సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది ముందు షూట్‌ చేస్తారంటూ అభిమానులు ప్రశ్నలవర్షం కురిపిస్తున్న వేళ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. రెండు సినిమాలు ఏకకాలంలో చిత్రీకరిస్తున్నానని తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి హైదరాబాద్‌, వైజాగ్‌లో RC15 తర్వాతి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Exit mobile version