సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపో, స్క్రాప్ గౌడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో కార్మికులు ఊపిరాడక మృతి చెందినట్లు తెలిసింది. డిపోలో చిక్కుకున్న మరికొంత మంది కోసం చర్యలు చేపడుతున్నారు. అయితే మృతులంతా బీహార్ వాసులుగా గుర్తించారు.