‘విక్రమ్’ మూవీలో హీరో సూర్య క్లైమాక్స్‌లో ఒక కీలక పాత్రలో కనిపించి అందరి మైండ్ బ్లాంక్ చేశాడు. ఆ ఐదు నిమిషాల పాత్ర గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. విక్రమ్‌లో సూర్యను పవర్ఫుల్ పాత్రలో చూసి ఫ్యాన్స్ చాలా ఆనందపడుతున్నారు. అయితే పుదుచ్ఛేరిలో సూర్య ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్లో మంటలు చేలరేగాయి. షో రన్ అవుతుండగా సూర్య స్క్రీన్‌పై కనిపించగానే ఫ్యాన్స్ టపాసులు పేల్చారు. దీంతో థియేటర్లో మంటలు అంటుకొని స్క్రీన్ కాలిపోయింది. వెంటనే థియేటర్ సిబ్బంది మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు.