కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయినా దీనిపై వెనక్కి తగ్గకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అగ్నిపథ్‌పై త్రివిధదళాల అధిపతులు కీలక ప్రకటన చేశారు. అగ్నిపథ్‌లో చేరాలనుకునే అభ్యర్థిపై FIR నమోదైతే అతను అర్హుడు కాదని, అతడిని అగ్నివీరునిగా తీసుకోలేమని స్పష్టం చేశారు. FIR నమోదవడమంటే క్రమశిక్షణారాహిత్యానికి నిదర్శనమని, అగ్నిపథ్‌లో దానికి చోటు లేదని పేర్కొన్నారు.