హైదరాబాద్ నాగోల్లో కాల్పులు కలకలం రేపాయి. స్నేహపురి కాలనీలో ఓ బంగారం దుకాణంలో చోరీ చేసేందుకు వచ్చిన దుండగలు..కాల్పులు జరిపారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వినియోగదారుల్లా షాపులోకి వచ్చి యజమానిని బెదిరించి బంగారం ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగులు పథకం ప్రకారమే బంగారం దుకాణాన్ని ఎంచుకున్నారని అనుమానిస్తున్నారు.