రావులపాలెంలో అర్ధరాత్రి ఫైరింగ్ కలకలం

కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. పట్టణంలో ఫైనాన్స్‌ వ్యాపారం చేసుకునే సత్యనారాయణ రెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి దుండగులకు ఎదురుతిరిగి పోరాడారు. ఈ క్రమంలో దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాధితులు గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు పారిపోతుండగా వారికి సంబంధించిన ఓ సంచి పడిపోయింది. అందులో 2 నాటు బాంబులు, నెట్‌వర్క్‌ జామర్‌ ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version