రష్యా పొరుగు దేశాల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగి దాడులకు దారితీశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది అర్మేనియా సైనికులు మృతి చెందారు. మరోవైపు పలు గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయాలని అక్కడి అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. 2020 నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అజర్ బైజాన్ సైన్యం వెనక్కి తగ్గాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించినట్లు తెలుస్తోంది.