• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IIT-Hలో ఫెలోషిప్ నెలకు రూ.60 వేల స్టైఫండ్

    ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT-H)లో ఫెలోషిప్ చేసేందుకు ప్రకటన వెలువడింది. ఫెలోషిప్ ఫర్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ టెక్నాలజీ (FIRST) స్కీమ్ మూడో రౌండ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. జూన్/జూలై 2022 సెషన్‌లో ప్రవేశానికి సంబంధించిన వివిధ విభాగాల్లో PhD చేసేందుకు విదేశీ స్టూడెంట్స్ కు పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది 4 సంవత్సరాల పాటు ఉండగా, ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1 లక్ష గ్రాంటుతోపాటు నెలకు రూ.60 వేల స్టైఫండ్ పొందవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఇ-మెయిల్ ద్వారా firs.iar@iith.ac.కు ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటలలోపు పంపవచ్చని ప్రకటించారు. FIRST దరఖాస్తు రుసుం కూడా లేదని ప్రకటించారు.