న్యాచురల్ స్టార్ నాని దసరా మూవీ నుంచి అప్ డేట్ వచ్చేసింది. మేకర్స్ నటుడి ఫస్ట్ లుక్ను వీడియో బైట్తో పాటు ఆవిష్కరించారు. వీడియోలో నాని లుక్ మాములుగా లేదు. నోటిలో సిగరేట్, ముఖానికి గాయం, లుంగీ కట్టుకని వెనుక జనాలతో వస్తున్నాడు. మరోవైపు బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ బీట్స్ ఆదరగొడుతుంది. తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. దసరా నేపథ్యంలో సాగే గ్రామీణ ప్రేమకథగా సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.