వడోదరకు చెందిన క్షమా బిందు అనే యువతి తనను తానే వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11న పెళ్లి జరగనుంది. ఇండియాలో ఇదే మొదటి స్వీయ వివాహం (సోలోగమీ). ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసే క్షమా తాను ఎప్పుడూ వివాహం చేసుకోవాలని అనుకోలేదని కానీ.. పెళ్లి కూతురు కావాలని అనుకున్నట్లు తెలిపింది. దీంతో తనను తానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందట. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం గోవాకు వెళ్లనున్నట్లు బిందు తెలియజేసింది.