వుమెన్స్ టీ20 చాలెంజ్ లో స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు మొదటి విజయం దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు మేఘనా, జెమీమా అదిరిపోయే స్కోర్ అందజేశారు. ఈ ఇద్దరు బ్యాటర్లు అర్ధ సెంచరీలతో రాణించారు. 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరును ట్రయల్ బ్లేజర్స్ సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగల్గింది. కిరణ్ నవ్‌గిరే (69) ధాటిగా ఆడినా కానీ ఫలితం లేకుండా పోయింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లలో పూనమ్ యాదవ్, గైక్వాడ్ చెరి రెండు, రేణుకా సింగ్, మ్యాథ్యూస్, సల్మా ఖతూన్, సోఫియా తలో వికెట్ తీసుకున్నారు.