బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమయి దాదాపు వారం కావొస్తోంది. మొత్తం 17 మంది పాత, కొత్త కంటెస్టెంట్స్ ను వారియర్స్, చాలెంజర్స్ టీమ్స్ గా విడగొట్టి నామినేషన్ల పర్వం సాగించారు బిగ్ బాస్. దీంతో ఈ వారం వారియర్స్ టీమ్ నుంచి 5 మంది, చాలెంజర్స్ నుంచి ఇద్దరు నామినేట్ అయ్యారు. వారిలో అరియానా, హమీదా, ముమైత్ కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వారిలో నటరాజ్ మాస్టర్, ఆర్జే చైతూకు మాజీ కంటెస్టెంట్ల సపోర్ట్ ఉంటుంది. ఇక చివరకు మిగిలిన వారిలో సరయు, మిత్ర శర్మ ఉన్నారు. బిగ్ బాస్ 5లో సరయు మొదటి వారంలోనే బయటకు రావడంతో ఆమెపై కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మిత్ర శర్మ తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.