ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి అయిదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. సభ ప్రారంభం నుంచి సమావేశాలకు అడ్డుపడుతున్నందున అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, బాల వీరాంజనేయులు సస్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం ఘటనపై టీడీపీ పట్టుపడడంతో పాటు, స్పీకర్‌పై పేపర్లు విసిరారు. దీంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అయినప్పటికీ సభకు అడ్డుపడుతున్నారని వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.