TRSను BRSగా మారుస్తూ జాతీయ రాజకీయాల్లో వెళ్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఏ ఏ రాష్ట్రాల్లో పోటీ చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. అయితే ఏపీలో మాత్రం BRS పార్టీ పేరుతో రోజుకో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. తాజాగా అమలాపురం పట్టణంలో రేవు అమ్మాజీరావు పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ ఏర్పాటైన రెండు రోజులకే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. మరి KCR పార్టీకి ఏపీలో ఏ మాత్రం మైలేజ్ వస్తుందో చూడాలి.
BRS పేరుతో ఏపీలో ఫ్లెక్సీలు

Screengrab Twitter: