అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. సాంకేతిక లోపంతో దేశమంతా విమానాలు ఆగిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (AFAA) సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడంతో విమానాలు నిలిపివేసినట్లు అమెరికా మీడియా తెలిపింది. విమానాలు తిరిగే మార్గాల్లో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే నోటమ్‌కు సంబంధించిన సమస్య తలెత్తినట్లు పేర్కొంది. దాదాపు 400 విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి.