అమెరికాలోని కాలిఫోర్నియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోటీ 50 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. పహారో నదిపైన లవీ వంతెన తెగిపోవడంతో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాను అధికారులు అప్రమత్తం చేశారు. రానున్న 24 గంటల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.