వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్‌ని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని రికీ పాంటింగ్ వెల్లడించాడు. దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. గ్రీన్ కోసం భారీగానే నిధులు మిగుల్చుకున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో గ్రీన్ రాణించాడు. మూడు మ్యాచులాడి రెండింట్లో అర్ధశతకం సాధించాడు. ముఖ్యంగా మొదటి టీ20లో భారత్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో గ్రీన్ కీలకపాత్ర పోషించాడు. డిసెంబరు 23న జరిగే మినీ వేలానికి ఈ ఆటగాడు తన పేరును నమోదు చేసుకున్నాడు.
వేలంలో అతడిపైనే దృష్టి: పాంటింగ్

© ANI Photo(file)