మా కాంబినేషన్‌పై దిష్టి పెట్టేశారు: సుధీర్ బాబు

సుధీర్ బాబు, కీర్తి శెట్టి జంటగా.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. నేడు విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సుధీర్ బాబు ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నాడు. తనకు, ఇంద్రగంటితో ఉన్న సంబంధం, తమ కాంబినేషన్‌పై స్పందించాడు. మనం సినిమాను తీస్తున్నామని అనుకుంటామని కానీ సినిమానే మనల్ని తీస్తుందన్నాడు. కథకు అనుకూలంగా ఇంద్రగంటి హీరోలను ఎంచుకుంటాడని పేర్కొన్నాడు. మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందా అనే ప్రశ్నకు.. మా కలయికకి ఇప్పటికే చాలామంది దిష్టిపెట్టేశారని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

Exit mobile version