నిద్రపట్టట్లేదా? పడుకోవడానికి నానా పాట్లు పడుతున్నారా? అయితే, రాత్రి త్వరగా నిద్రపట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలట. పడుకునే గంట ముందు నుంచి డిజిటల్ తెరలకు దూరంగా ఉండటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినడం, పుస్తకం చదవడం లాంటివి చేయాలట. ఇవి మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. మరోవైపు, పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, పాలు తాగడం, అరికాళ్లపై నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల కూడా త్వరగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి రోజులో కనీసం 7గంటల నిద్ర కావాలట.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్