ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆహార పరిశ్రమలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు ఇప్పుడు ఆహారం తయారీలో యంత్రాలపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. దేశానికి చెందిన కొన్ని స్టార్టప్ లు కిచెన్ లో రోబోలను ఉపయోగించడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నాయి. ముకుందా ఫుడ్స్, కుక్, ఆన్ 2 కుక్ అనే సంస్థలు సిబ్బందిని తగ్గించటంతో పాటు సమయానికి వినియోగదారులకు ఆహారం అందేలా సమాయత్తం అవుతున్నాయి.