ఫుట్ బాల్ మ్యాచ్ ఘర్షణ.. 127 మంది మృతి

© ANI Photo

ఇండోనేసియా- టాప్ లీగ్‌ ఫుట్ బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో జరిగిన తొక్కిసలాట వల్ల 127మంది మరణించారు. మరో 180మంది గాయపడ్డారు. మ్యాచ్‌లో భాగంగా శనివారం రాత్రి మలాంగ్ స్టేడియంలో స్థానిక అరేమా ఎఫ్‌సీ, పెర్సేబయా సురబయా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్సేబయా జట్టు విజయం సాధించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని అరేమా అభిమానులు పెర్సేబయా ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య హింసాకాండకు దారితీసింది.

Exit mobile version