బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తన రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. తొలి సినిమాకు కేవలం రూ. 1.25 లక్షలు తీసుకున్న కార్తీక్…కరోనా సమయంలో ఓ చిత్రానికి ఏకంగా రూ. 20 కోట్లు తీసుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. “ పాండమిక్ సమయంలో రూ. 20 కోట్లు తీసుకున్న మాట నిజమే. ఆ సినిమాను 10 రోజుల్లో పూర్తి చేశాను. దానివల్ల నిర్మాతలకు చాలా లాభాలు వచ్చాయి. కాబట్టి నేను తీసుకోవడంలో తప్పు లేదు ” అన్నాడు.