• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • 220 మంది ITC ఉద్యోగులకు రూ. కోటికి పైగా జీతం

    దేశంలోనే అత్యంత ప్రముఖ కంపెనీల్లో ITC ఒకటి. FMCG, హోటల్, అగ్రి బిజినెస్ వంటి రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీల్లో ఉద్యోగుల జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఈ సంస్థలో పని చేస్తూ రూ.కోటికి పైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 220 మంది ఉద్యోగులు రూ.కోటికి పైగా జీతం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అది గత సంవత్సరంతో పోలిస్తే 44 శాతం(గతంలో 153 మంది) ఎక్కువ. అటు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి జీతం సైతం 5.35 శాతం(ప్రస్తుతం వార్షిక జీతం రూ.12.59 కోట్లు) పెరిగినట్లు వెల్లడించింది.