తన తండ్రి ప్రశాంతంగా కన్నుమూశారని సీనియర్ చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు. సినీ ఇండస్ట్రీలో అందరూ తన తండ్రి గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా బాగుండేదని గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి ఎన్టీఆర్, మంచి భోజనం, జోక్స్ ఈ మూడూ ప్రాణమని చెప్పారు. ఎంతో అభిమానించే ఎన్టీఆర్తో నటించే అదృష్టం తన తండ్రికి దక్కిందని అన్నారు.బుధవారం చలపతిరావు ఆంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.