టీమిండియా మాజీ ఆల్ రౌండర్.. ఇర్ఫాన్ పఠాన్ యంగ్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ కు పలు సూచనలు చేశాడు. నీవు స్పీడ్ ను అస్సలుకే తగ్గించుకోవద్దని.. లైన్ అండ్ లెంగ్త్ విషయంలో ఖచ్చితత్వం పాటించాలని, ఏ విషయాల్లో మెరుగయ్యామనే విషయాలు మ్యాచ్ అనంతరం తెలుసుకోవాలని చెప్పాడు. స్టంప్స్ కు దగ్గరగా.. బంతులు వేయాలని పఠాన్ ఉమ్రాన్ కు సూచించాడు. నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో ఉమ్రాన్ కు చోటు దొరుకుతుందో లేదో కాసేపట్లో తేలనుంది.