బాలయ్య అన్ స్టాపబుల్ షో సీజన్ 2కు ఊహించని గెస్ట్లు వచ్చారు. బాలయ్య టాక్ షోలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు.. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సందడి చేయనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బాలయ్య షోకువచ్చిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య రాజకీయంగా ఎలాంటి ఆసక్తికర చర్చ జరగనుందని ఇప్పుడు అందరి మదిలో ఆసక్తి నెలకొంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పీకర్గా పనిచేశారు. బాలయ్య షోకు ఇద్దరు స్పీకర్లు హాజరు కావడంతో షోపై మంచి బజ్ ఏర్పడింది.
బాలయ్య షోలో ఏపీ మాజీ సీఎం

Screengrab Twitter: aha