టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(50)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మద్యం తాగి వాహనం నడపడంతో పాటు బిల్డింగ్‌లో పార్క్ చేసి ఉన్న ఓ మాజీ క్రికెటర్ భార్య కారును సైతం గుద్దడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సుమారు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో కాంబ్లీ తన హోండా సిటీ కారులో వస్తున్నాడని, అంత వేగంతో వస్తుండడంతో అదుపుతప్పి ఢీకొన్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ఆల్కహాల్ టెస్ట్ కోసం అతడి బ్లడ్‌ను పరీక్షకు పంపించామని పోలీసులు వెల్లడించారు.