బిహార్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కన్నుమూశారు. యూపీ ప్రయాగ్ రాజ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తన ఇంట్లో జారిపడటంతో ఛాతి ఎముక విరిగి ఆస్రత్రిలో చేరారు. మూడ్రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. 1934లో అలహాబాద్‌లో జన్మించిన త్రిపాఠి..రాజకీయాల్లో పలు హోదాల్లో పనిచేశారు. ఆరుసార్లు యూపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2019 వరకు బెంగాల్ గవర్నర్‌గా పనిచేేసిన ఆయన..బిహార్, మేఘాలయ, మిజోరం గవర్నర్‌గాను సేవలందించారు.