టీమిండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌పై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు కావాలని భట్ కొనియాడాడు. న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ చూసి మైమరిచిపోయానని తెలిపాడు. ‘ఆహా. ఎంత చక్కగా, పొందికగా షాట్స్ ఆడతాడో. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ నేను గిల్ ఆట చూశా. స్ట్రోక్ షాట్స్ ఆడుతుంటే ఎంతో చూడముచ్చటగా అనిపించింది. కచ్చితంగా శుభ్‌మన్ భవిష్యత్తులో ఓ వెలుగు వెలుగుతాడు’ అంటూ సల్మాన్ భట్ పొగిడాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేసి డబుల్ సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు.