గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి మరో యువతితో ఉండగా తన భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. మరో యువతితో ఓ హోటల్ గదిలో సోలంకి ఏకాంతంగా ఉన్న సమయంలో, అతని భార్య కొందరితో కలిసి వెళ్లి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వాళ్ళను అలా చూసి కోపం తట్టుకోలేక, సోలంకిని ఆ యువతిని చితకబాదింది. ఆ యువతితో ఉన్న అక్రమ సంబంధం కారణంగా తనను రోజు చిత్రహింసలు పెట్టి, ఇంటి నుంచి పంపించేశాడని ఆమె పేర్కొంది.