పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు బ్యాంకుల వినియోగదారులకు అలెర్ట్. ఈ రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. నేడు నాలుగో శనివారం, రేపు ఆదివారం కావడంతో సహజంగానే బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. ఇక, మార్చి 28,29 తేదీలలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెండు రోజులు సమ్మెకు పిలుపునిచ్చారు. కేంద్రం బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారు సమ్మెను నిర్వహించబోతున్నారు. కాగా, వచ్చే నెలలో ప్రారంభంలో కూడా వరుసగా సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాలను గమనించి బ్యాంకుల పనిదినాల్లో వెళ్లాలి.