• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • ఒకే కుటుంబంలో నలుగురు మృతి

  TS: హైదరాబాద్‌లోని తార్నాకలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానస్పదంగా మృతి చెందారు. మృతులను చెన్నైకి చెందిన ప్రతాప్(34), సింధూజ(32) దంపతులు, కుమార్తె ఆద్య(4), ప్రతాప్ తల్లి రాజతిగా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ మరణాలకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ప్రతాప్ ఉరివేసుకుని కనిపించగా.. మిగతా ముగ్గురు విగతజీవులై పడిఉండటం సందేహాలను రేకెత్తిస్తోంది. నిన్నటి నుంచి తలుపు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.