ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని GST విభాగంలో నలుగురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణ కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల్లో కీలకంగా పనిచేస్తున్న ఈ నలుగురిని సస్పెండ్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఉద్యోగ సంఘాలు గవర్నర్ను కలిస్తే… ఎందుకు కలిశారంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.