బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్నా నాలుగో టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగించారు. కోహ్లీ, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్ బ్యాట్‌తో రాణించారు. 91 పరుగుల ఆధిక్యం లభించగా… ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు వచ్చింది. ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మూడు పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్‌తో పాటు నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన మాథ్యూ కుహ్‌నేమన్ క్రీజులో ఉన్నారు. రేపు చివరి రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది.