ఫ్రాన్స్ ఫుట్ బాల్ కెప్టెన్ హ్యూగో లోరిస్ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. 36 ఏళ్ల లోరిస్ ఫ్రాన్స్ జట్టుకు 14ఏళ్లు సేవలందించాడు. 2018లో లోరిస్ హయాంలోనే ఫ్రాన్స్ జట్లు ఫిపా వరల్డ్ కప్ సాధించింది. గతేడాది ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చినా.. పెనాల్డీ షూట్ అవుట్లో అర్జెంటీనా గెలిచింది.