వచ్చే ఐపీఎల్ సీజన్ ప్రసారాలను తన వినియోగదారులకు ఉచితంగా అందించాలని రిలయన్స్ జియో ఆలోచిస్తోంది. ఇదే జరిగితే సంచలనమనే చెప్పాలి. కాగా 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసారాలను రిలయన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫిఫా వరల్డ్ కప్‌ను జియో సినిమా యాప్‌లో ఉచితంగా ప్రసారం చేసింది. ఇదే స్ట్రాటజీని ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో కూడా అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 11 స్థానిక భాషల్లో ఐపీఎల్ ప్రసారం చేయాలని ఆలోచిస్తోంది.