తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ 30,353 పోస్టుల భర్తీకి అనుమతి కూడా ఇచ్చింది. ఇందులో భారీగా పోలీస్ ఉద్యోగాల కూడా ఉండనున్నాయి. ఈ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రామగుండం సీపీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమ ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. రామగుండం పరిధిలోని పోలీస్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.