ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వారికి ఉచిత శిక్షణ, వసతి కల్పిస్తామని వైస్ ఛాన్సలర్ ప్రొ. డి.రవీందర్ రెడ్డి తెలిపారు. సివిల్స్‌కి సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం మరో నెల రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వివరించారు. అలాగే గ్రూప్-1, 2,3, 4, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ బోర్డుల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు కూడ శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఒకేసారి 700 మందికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ పేర్కొన్నారు.