ఏడు బంతుల్లో ఏడు సిక్స్‌లు బాది మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఓవర్ వేసిన బౌలర్ శివ సింగ్‌లో రుతురాజ్ స్ఫూర్తి నింపాడు. ‘గాయంతో తిరిగొచ్చాక ఆడిన తొలి మ్యాచ్ అది. నాపై ఒత్తిడి నన్ను అలా ఆడేలా చేసింది. మిత్రమా(శివసింగ్).. ఒక్కసారి స్టువర్ట్ బ్రాడ్‌ని గుర్తు చేసుకో. ఆనాడు ఆరు సిక్స్‌లు సమర్పించుకున్న అనంతరం కెరీర్‌ని అతడెలా మలుచుకున్నాడో గమనించు. ఆ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్‌ని స్ఫూర్తిగా తీసుకో. ప్రతి వైఫల్యం మనకు కొత్త విషయాన్ని నేర్పుతుంది’ అని రుతురాజ్ చెప్పాడు. 2007లో బ్రాడ్ బౌలింగులో యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే.