నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి క్షేత్రంలోని బాలాలయంలో ఆంతరంగికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎస్.గీత తెలిపారు. 11 రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలలో ఈ సారి స్వామి వారి మొక్కు సేవలు రద్దు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునీతమహేందర్ రెడ్డిలు హాజరుకానున్నారు.