నేడు చిరువ్యాపారులకు జగనన్న తోడు నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణాలను బ్యాంకుల ద్వారా విడుదల చేయనున్నారు. మొత్తం 3.95లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ రుణాలకు వడ్డీని 6నెలల వరకు ప్రభుత్వమే భరించనుంది. చేతివృత్తులు, సంప్రదాయ వృత్తుల వారికి సాయం చేసేందుకు మరో రూ.395కోట్లు కొత్త రుణాలను బ్యాంకుల ద్వారా అందజేయనున్నారు.