అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై G23 గ్రూప్ అని పిలువబడే కాంగ్రెస్ అసమ్మతివాదులు ఢిల్లీలోని గులాం నబీ ఆజాద్ నివాసంలో సమావేశమయ్యారు. G23 గ్రూప్ నేతలతో పాటు పలువురు అసంతృప్త నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సోనియాగాంధీ నాయకత్వాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించిన తరువాత ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంచరించుకుంది.